ADB: భారతీయ బుద్ధ మహా కమిటీ సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్నను జిల్లాలో బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మే 3వ తేదీన గాంధీనగర్లో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలను మాజీ మంత్రితో కలిసి ఆవిష్కరించారు. జోగురామన్న మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు.