MDK: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతుంది. ఇవాళ ఆర్టీసీ డిపోల ముందు మహాధర్నా కార్యక్రమానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం డీపో వద్దకు వచ్చిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా అధికారులు ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ కార్మికులతో నడిపించే ఏర్పాట్లు చేస్తున్నరు.