హీరో సిద్ధార్థ్, హీరోయిన్ త్రిష మళ్లీ కలిసి నటించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాకు “భర్తగా మారకు బ్యాచిలరూ” అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం.