టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘మృత్యుంజయ’ వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోయినా, ఆయన క్రేజ్ తగ్గలేదు. తాజాగా ‘రంగబలి’ ఫేమ్ పవన్ బసమశెట్టి దర్శకత్వంలో శ్రీవిష్ణు ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రం, ‘సామజవరగమన’రేంజ్లో ప్రేక్షకులను అలరించనుందని సమాచారం.