CTR: జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. బుధవారం అత్యధికంగా ఎస్.ఆర్ పురం మండలంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయపురం, నగరిలో 41.1, తవణంపల్లెలో 40.8, గంగాధరనెల్లూరు, రొంపిచెర్ల మండలాల్లో 40.3, బంగారుపాళ్యం, నిండ్ర, పులిచెర్ల మండలాల్లో 39.9, గుడిపాల, వెదురుకుప్పం మండలాల్లో 39.5, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్ మండలాల్లో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.