ELR: పీజీఆర్ఎస్లో అందిన సమస్యకు కలెక్టర్ వెట్రిసెల్వి చొరవతో అధికారులు పరిష్కారం చూపారు. ఉంగుటూరు మండలం తల్లాపురంనకు చెందిన వృద్ధ దంపతులు వారికి ముగ్గురు మనవరాలు ఉన్నారు. వారికి ఆధార కార్డ్ లేకపోవడంతో స్కూల్‌కి వెళ్లలేని పరిస్థితి ఉన్నట్లు పీజీఆర్ఎస్లో వివరించారు. ఆ చిన్నారులకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించి విద్యాకిట్లను అందించారు.