ATP: పుట్లూరు మండలంలోని బెలుగు గుట్ట నుంచి రైతులు బెలుకు తోలుకోకుండా అధికారులు ఆంక్షలు విధించడంపై YCP నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతులు తహసీల్దార్, సీఐకి విన్నవించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వీడాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.