CTR: తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ @ సుధాకర్ (29) కు తిరుపతి RSS ADJ కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ చెప్పారు. దీంతోపాటు రూ.3 లక్షలు జరిమానా కోర్టు విధించిందన్నారు. ఇతనిపై 2018 లో రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. విచారణ జరిపి న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై తెలిపారు.