GDWL: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యేనని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ ఆరోపించారు. జిల్లా ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.