AP: కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ కొనసాగుతోంది. విచారణ, ప్రొసీడింగ్స్ అనంతరం అనంతబాబును కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లనున్నారు. సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సాక్షులను ప్రభావితం చేశారన్న అభియోగాలతో నిన్న అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.