VZM: గంట్యాడ మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంట్యాడ శ్రీదేవి టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు గంట్యాడ శ్రీదేవి టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీదేవికి శుభాకాంక్షలు తెలియజేసి దుస్సాలువాలతో సత్కరించారు.