TPT: సత్యవేడు నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లకు చేపట్టిన మరమ్మత్తుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శుక్రవారం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హరీష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కుక్, స్వీపర్ ఖాళీలైన 12 పోస్టులను కూడా త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.