ATP: ఏపీ బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ కార్యక్రమంపై నియోజకవర్గ అధికారులతో MLA కాలవ శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో పనులు వేగవంతం చేయాలన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి లబ్ధిదారునికి అందాలని పేర్కొన్నారు.