వికారాబాద్ జిల్లా తాండూరులో నిరుద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మె నడుస్తున్న నేపథ్యంలో అధికారులు నిరుద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు కండక్టర్, డ్రైవర్ల కోసం అర్హతలు కలిగిన అభ్యర్థులు తాండూర్ డిపోలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుగుణాత్ పేర్కొన్నారు.