TG: రాష్ట్రవ్యాప్తంగా పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(PACS) విషయంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు వ్యవసాయ రుణాల పంపిణీలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఈ సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త పాలకవర్గాలను నియమించేందుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల రుణాల పంపిణీతో పాటు ఇతర సహకార కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగే అవకాశం ఉంది.