SRCL: వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం పట్టణ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి ఇలాంటి సౌకర్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వివాహాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ మండపం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.