JGL: ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇండస్ట్రీస్, పద్మావతి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్, డీసీఎస్వో కలిసి తనిఖీ చేశారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025-26 సిఎంఆర్ బియ్యం సరఫరా పురోగతిని పరిశీలించారు. పెండింగ్ డెలివరీలను వేగంగా పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. నిల్వలు, మిల్లింగ్, రవాణా వివరాలు అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.