MDK: 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి ‘బెస్ట్ అవైలబుల్ పాఠశాల’ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వి.నీలిమ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.