WNP: ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తోందని, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీ మల్లురవి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆయనతో పాటు, ఎమ్మెల్యే మేఘారెడ్డి కలిసి తిలకించారు.