TG: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన బీజేపీ గూటికి వెళ్తారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు KCRతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.