PDPL: సుల్తానాబాద్‌లోని సుగ్లంపల్లి సింగిల్ విండో కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పిస్తామని, పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా ప్రభుత్వ కేంద్రాలకే ధాన్యం తీసుకురావాలని సూచించారు.