NLG: మిర్యాలగూడ డీఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. వికారాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను మిర్యాలగూడ డీఎస్పీగా నియమిస్తూ డీఐజీ బి. శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రాజును సీఐడీ విభాగానికి డీఎస్పీగా బదిలీ చేశారు. ఆనంద రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా పనిచేశారు.