ELR: లక్కవరం గ్రామంలో పోలీసులు సోమవారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్కవరం ఎస్సై జబీర్ నూతన చట్టాలపై ప్రజలకి అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ షేరింగ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఎలా రక్షణ పొందాలో యువతకు తెలియజేశారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.