HYD: నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన వాహనాలపై మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 182 కేసులు నమోదు చేసి, రూ.2.44 లక్షల జరిమానా విధించారు. భారీ శబ్దాలతో పక్కవారికి ఇబ్బంది, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 36 సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నారు.