KMR: జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 ఉచిత శిబిరాలు, పట్టణాల్లో ఫీజుతో కూడిన శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. శిక్షకులుగా ఆసక్తి గల వారు ఈనెల 24లోగా ఐడీవోసీలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.