SRPT: మోతే మండలం విభాళాపురం గ్రామంలో వీధిదీపాలు పగటిపూట ఆన్‌లో ఉండటంతో విద్యుత్ వృథా అవుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో వెలుతురు అవసరమైనప్పటికీ, పగలు కూడా దీపాలు వెలుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్థులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆటోమేటిక్ టైమర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.