GDWL: గద్వాల పట్టణంలోని మా మార్ట్ బ్యాంక్వెట్ హాల్లో స్పార్క్స్ కిడ్స్ ప్లే పాఠశాల తొలి వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ శ్యామ్ సుందర్ హాజరై చిన్నారుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, షిప్రా టీం నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.