SRCL: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.