VKB: కొడంగల్లో రూ.110 కోట్లతో చేపట్టనున్న శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్, MRO రాంబాబు కోరారు. శనివారం ఆలయ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. బాధితులు త్వరితగతిన ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.