PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో అంగన్వాడీ కేంద్రం-1, 3, 4లో సంయుక్తంగా ఇవాళ పోషన్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలు, తీసుకోవలసిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.