TG: గ్రామ పంచాయతీలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. మొత్తం నిధుల్లో 50% పారిశుధ్యం, చెత్త సేకరణకు, మిగతా 50% తాగునీటి సరఫరా, నీటి సంరక్షణకు కేటాయించాలి. స్కూళ్లు, అంగన్వాడీల్లో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.