ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సోమవారం CPM ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. CPM మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. పట్టణంలోని దాసరి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీలో డ్రైనేజీ కాలవలు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు.