BDK: కొత్తగూడెం IDOC కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.