KNR: వందల ఏళ్ల కిందటే కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బసవేశ్వర జయంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యను ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.