BHNG: వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.