SRPT: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంబంధించి 31, ఇతర శాఖలకు చెందిన 30 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దరఖాస్తులను తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.