MBNR: జడ్చర్ల గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ మౌనిక తెలిపారు. 1వ తరగతి 30, 2వ తరగతి 2, 5వ తరగతి 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆధార్, జనన, కుల, ఆదాయం సర్టిఫికెట్లు, ఫోటోలతో మే 5లోపు దరఖాస్తు చేయాలి. ఎంపిక డ్రా ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు అందిస్తారు.