కోనసీమ: కొత్తపేట నడిబొడ్డున మందపల్లి పరిధిలో ఉన్న సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కోనసీమలో ఉన్న ప్రసిద్ధ సాయిబాబా ఆలయాలలో ఒకటిగా, దక్షిణ షిర్డీగా పేరు పొందింది. ప్రతీ గురువారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. చిన్నారులకు పటిక బెల్లం తులాభారం ఇస్తుంటారు.