ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి (29) గుండెపోటుతో కన్నుమూసింది. ఘజియాబాద్‌లో ఉంటూ హర్యానా, యూపీ మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. 50కి పైగా వీడియోలు, సినిమాల్లో నటించి హీరోయిన్గా ఎదగాలనుకున్న తరుణంలోనే ఈ విషాదం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె మృతితో అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.