AP: సమాజానికి మంచి చేసే నాయకుల తయారీ TDP పని అని మంత్రి సవిత తెలిపారు. హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీ.. వైసీపీ అని ధ్వజమెత్తారు. సాక్షులు, కుటుంబసభ్యులు, జడ్జిలను కూడా బెదిరించడం జగన్కు అలవాటని విమర్శించారు. జగన్ తరహాలోనే YCP నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి శవం పెట్టుకుని రాజకీయం చేయడం, బాబాయ్ గొడ్డలి పోటు ఇప్పటికే చూశామని పేర్కొన్నారు.