సంగారెడ్డి డీపో పరిధిలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సమ్మె సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా 108 అంబులెన్సు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్, కో ఆర్డినేటర్ శాలి హుస్సేన్ ఈ సేవలను పర్య వేక్షిస్తున్నారు.