AP: గోదావరి పుష్కరాల కోసం ప్రస్తుతం రూ.150 కోట్లతో పనులు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ‘విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. విద్యుత్ ఛార్జీల్లో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు.