KRNL: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లలో ఉచిత అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కల్లూరు అర్బన్ ఎస్టేట్లోని అన్న క్యాంటీన్లో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె అల్పాహారం పంపిణీ చేశారు.