NLG: నల్గొండ మండలం అన్నేపర్తి లో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల వద్ద కనీస వసతులు కల్పించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కూలీల కన్వీనర్ దండెంపల్లి సరోజ, సైదులు పాల్గొన్నారు.