KMM: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెబాట పడుతున్నట్లు ఆర్టీసీ ఐకాస కమిటీ బుధవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ బంద్‌ను ప్రకటించింది. దీంతో తల్లాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. సమ్మె ప్రభావంతో బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు.