రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నారనే వార్తలు బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రణ్వీర్ సిద్ధమయ్యాడట. ఈ మూవీ నుంచి వైదొలిగినందుకు గానూ ఆయన రూ.10 కోట్లు తిరిగి ఇచ్చేస్తారని, అలాగే తన తదుపరి మూవీ ‘ప్రళయ్’లో అక్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం.