సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా రెండో రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లిటిల్ ఇండియాలోని నలన్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి కే. షణ్ముగంతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరిపాలనా అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించారు.