ADB: ఉట్నూరు మండలంలోని గోండుగూడెంలో ‘ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్’ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోండుగూడెం నుంచి 8 బస్సుల్లో 250 మంది ఆదివాసీలు హైదరాబాద్కు బయలుదేరారు. 2 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామంను సందర్శిస్తారు.