WGL: ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎంజీఎం ఆస్పత్రిలో సర్జికల్ పరికరాల కొరత తీవ్రంగా మారింది. గత రెండేళ్లుగా సుమారు రూ.2 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాదారులు సరఫరా నిలిపివేశారు. గ్లోవ్స్, స్యూటర్స్, సిరంజీలు కొరతతో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రోగుల కుటుంబ సభ్యులే పరికరాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని సిబ్బంది తెలిపారు.