ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం SRH స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన తండ్రి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నేను అండర్-12లో ఉన్నప్పటి నుంచి మా నాన్న కూర్చుని నాకు ఎలా ఆడాలో చెబుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ స్టాండ్స్లోంచి నన్ను చూస్తుండటం, నేను ఆయనను చూస్తుండటం, ఆయన నాకు సూచనలు ఇవ్వడం నిజంగా అద్భుతం’ అని అన్నాడు.